సినీ నటుడిగా కెరీర్ కొనసాగిస్తూనే శరత్ బాబు ఆస్తిపాస్తులు బాగానే కూడబెట్టారట. అయితే ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. ఇందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటుడు శరత్ బాబు (71) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో ఆయన మరణించినట్లు తెలిసింది.
అయితే హార్సిలీహిల్స్‌లో ఓ ఇల్లు కట్టుకోవాలనేది శరత్ బాబు బలంగా కోరుకున్నారట. అక్కడ ఇంటి నిర్మాణ పనులను కూడా స్టార్ట్ చేశారు.. కానీ ఆ పనులు పూర్తి కాకముందే ఆయన కన్నుమూశారు. దీంతో శరత్ బాబు చివరి కోరిక తీరలేదు. ఏపీలో హార్సిలీ హిల్స్ ప్రాంతం ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టుకుని ఉండాలని శరత్ బాబు బాగా ప్రయత్నం చేశారట. అందుకోసం ఆయన స్థలం కూడా కొనేసి ఇల్లు ప్రారంభించిన తర్వాత.. చివరకు శరత్ బాబు కన్నుమూయడం చాలా బాధాకరం.