AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీకి మరో అరుదైన సత్కారం..

అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న వేళ.. ప్రధాని మోదీకి వివిధ దేశాలు అరుదైన గౌరవాన్ని ఇస్తున్నాయి. ఇండియా – పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ మూడో సదస్సులో భాగంగా పపువా న్యూ గినియా దేశంలో పర్యటిస్తున్న ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పపువా న్యూ గినియా ప్రభుత్వం మోదీకి అరుదైన సత్కారాన్ని అందించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహును ఇచ్చి గౌరవించింది. ఈ అవార్డును అందించినందుకు గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడేకు ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశానికి, భారత ప్రజల విజయాలకు గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఫిజీ ప్రధానమంత్రి సిటివేని రెబుకా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఘనంగా సత్కరించారు. ఫిజీ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించారు. ది కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రధాని మోదికి ఇచ్చారు. ఇప్పటివరకు ఫిజీ దేశస్థులు కాకుండా.. అతి కొద్ది మందికి మాత్రమే ఈ సత్కారాన్ని అందించడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గ్లోబల్ లీడర్‌షిప్‌కు గుర్తుగా దీన్ని అందజేశారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రదానం చేసినందుకు ఫిజీ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్ – ఫిజీ దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇది గుర్తింపు అని కొనియాడారు.

ANN TOP 10