హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును రద్దు చేసిన తదినంతర పరిణామాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవడంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని చెబుతూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు.
2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే రూ.2000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందన్నారు. ప్రస్తుతం అదీగాక కొద్దో గొప్పో నోట్లు ఉన్నవాళ్లు మార్చుకోవడానికి 4 నెలల సమయం కూడా ఇచ్చిందని విజయశాంతి పేర్కొన్నారు. అందువల్ల ఈ నిర్ణయంతో సామాన్యులకి కలిగిన నష్టం ఏమీ లేకున్నా… ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆ వర్గాలు వ్యతిరేక ప్రచారానికి దిగాయన్నారు.