రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను డిగ్రీ ఆన్ లైన్ సర్వీస్ తెలంగాణ నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల దోస్త్ ప్రక్రియ కొనసాగనుంది. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్, జూన్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.ఆ తర్వాత రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 16 నుంచి జూన్ 26 వరకు కొనసాగనున్నాయి. జూన్ 16 నుంచి 27 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. జూన్ 30న రెండో విడత సీట్ల కేటాయింపు జరగనుంది. జులై 1 నుంచి 5 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, జూన్ 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్స్, జూలై 10న మూడో విడతకు సంబంధించిన సీట్ల కేటాయింపు జరగనుంది. జూలై 17 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు.
