హైదరాబాద్ లో ఉగ్రకదలికలపై బీజేపీ నేత డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా సరే.. దాని మూలాలు హైదరాబాద్ నుండే ఉంటున్నాయని, ఇంత జరుగుతుంటే ఇక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. పార్టీ ఆఫీస్ లో ఆయన మీడియాతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో అరెస్టయిన ఓ ఉగ్రవాది.. మజ్లీస్ కు చెందిన ఓ కాలేజీలో HOD అని స్పష్టమవుతుందన్నారు. మన దగ్గర ఎంతో నైపుణ్యం కలిగిన పోలీసులు ఉన్నారని, ఎందుకు వారికి స్వేచ్ఛ ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని.. దేశ భద్రతకు భంగం కలిగించే వాటిపై ముందు దృష్టి పెట్టాలని హెచ్చరించారు.
