TSPSC పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.వీరు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇక దీంతో TSPSC పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 27కు చేరింది. మరోవైపు పేపర్ లీక్ ఘటనపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. మనీలాండరింగ్ జరిగాయన్న ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తుంది.