రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు పదవిలో కొనసాగేలా జీవో జారీ చేశారు. కొంతకాలంగా సోమేశ్ కుమార్ నియామకంపై ఊహాగానాలు వినిపించాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో నియమిస్తారని,ఎక్సయిజ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వార్తలు వెలువడ్డాయి. కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమితులవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా ఆయనను అప్పటి ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయించినా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో 2022 డిసెంబరు వరకు కంటిన్యూ అయ్యారు. చివరకు హైకోర్టు తీర్పుతో ఆయనను ఆంధ్రరాష్ట్రానికి బదిలీ కావడంతో సంక్రాంతి పండుగకు ముందు అక్కడ చేరి చివరకు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా పనిచేయనున్నారు.