AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది శ్రీనివాస రెడ్డితో రాహుల్ గాంధీ టీం చర్చలు

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్…తాజాగా బలమైన నాయకులపై గురిపెట్టింది. ఆదిలాబాద్ లో కీలక నేత, కేఎస్సార్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస రెడ్డితో రాహుల్ గాంధీ టీమ్ సమావేశమైంది. పార్టీలో చేరికపై కంది శ్రీనివాస రెడ్డితో చర్చలు జరిపింది. కంది శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది రాహుల్ టీం.మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో కందిపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస రెడ్డి బలమైన నాయకుడిగా ఎదిగారు. ప్రజా నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేశారు. బస్తీబాట కార్యక్రమంతో ఆదిలాబాద్ లోని ప్రతి సమస్యను తెలుసుకున్న కందిశ్రీనివాస రెడ్డి.. ఆదిలాబాద్ సమస్యలపై నిత్యం పాలకులను నిలదీస్తున్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కంది శ్రీనివాస రెడ్డి పోరాడుతున్నారు. కష్టసుఖాల్లో ఆదిలాబాద్ ప్రజలను ఆదుకుంటున్నారు.కంది శ్రీనివాస రెడ్డి చేరికతో గెలుపు ఖాయమని భావిస్తుంది కాంగ్రెస్.కంది శ్రీనివాస రెడ్డిపై అడుగులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తలతో చర్చలు జరిపి.. తదుపురి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, విదేశి విభాగ్ నేతలు కూడా కంది శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిసింది. గతేడాది కంది శ్రీనివాస రెడ్డి బీజేపీ స్టేట్ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బలమైన బీజేపీ ప్రతర్థిగా నిలబడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ టీం చర్చలు జరపడం.. పార్టీ మార్పుపై తొందరవద్దని ఎంపీ అరవింద్ కంది శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేయడం మరింత ఉత్కంఠ రేపుతుంది.కంది శ్రీనివాస రెడ్డి తదుపరి నిర్ణయం ఏంటనీ.. ఆయన అడుగులు ఎటు వైపు అనేది రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10