హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ అధికారులు శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎల్లమ్మ తల్లికి 2.20 కిలోల బంగారు కిరీటం, ఇతర ఆభరణాలు సమర్పించనున్నామని తెలిపారు మంత్రి. ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చేయిస్తున్నామని తెలిపారు.