యాదాద్రి: సీఎం కేసీఆర్ (CM KCR) తొమ్మిదేళ్ల తర్వాత రాజభవనం లాంటి సెక్రటేరియట్ కట్టుకుని కుర్చీలో కూర్చొని సంతకం చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy Venkat Reddy) అన్నారు. పేరుకు 1000 కోట్లు అంటున్నా రెండువేల కోట్లతో రాజభవనం కట్టుకున్నారని ఆరోపించారు. జిల్లాలోని మోత్కూర్ మండలం కొండగడపలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.
మంచి భవనం కూలగొట్టి సెక్రటేరియట్ కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్లల్లో డబుల్ బెడ్ రూమ్ లు, పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు. సెక్రటేరియట్‌కి అంబెడ్కర్ పేరు పెట్టుకున్నా అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తు ప్రకారం కట్టుకున్న సెక్రటేరియట్‌కి రోజు రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.