AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విమర్శలు పట్టించుకోం.. ప్రగతి బాట వీడం

రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందిరికీ జోహార్లు
నూతన సచివాలయం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌
హైదరాబాద్: రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందిరికీ సీఎం సీఆర్‌ జోహార్లు తెలిపారు. తెలంగాణ సచివాలయం ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని పేర్కొన్నారు. తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారని గుర్తుచేశారు. మత్తడి తొక్కుతున్న చెరువులే రాష్ట్ర పునర్నిర్మాణానిక తార్కాణం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో చెరవుల రూపురేఖలు మార్చామన్నారు. విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం అన్నారు. చెక్ డ్యామ్ ల వల్ల వేసవిలోనూ నీళ్లు పుష్కలంగా ఉన్నాయన్నారు.

వేసవిలో దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు సాగయ్యాయయని సిఎం తెలిపారు. దేశంలో సాగైన దాంట్లో 54 లక్షల ఎకరాలు మనవద్దే సాగైందన్నారు. తెలంగాణ పల్లెలు ఎన్నో అవార్డులు సాధిస్తున్నాయి. కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర పునర్నిర్మాణమే, వలసలు వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం పునర్నిర్మాణమే, ఆచరణాత్మక విధానాలతో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చోట్ల కూలగొట్టి కట్టామన్నారు. సమ్మిళిత అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్తోందని ఆయన వెల్లడించారు. ఐటిలో బెంగళూరును దాటి తెలంగాణ దూసుకుపోతోందని సీఎం సీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ సచివాలయ (Secretariat) నిర్మాణంలో అందరి కృషి ఉందని సీఎం కేసీఆర్‌ (CM KCR) స్పష్టం చేశారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ (Telangana) పల్లెలూ వెలుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ (Ambedkar) చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. గాంధీ మార్గంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని, తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారని, విమర్శలు పట్టించుకోకుండా కృషి చేయడమే తమ విధానమని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

‘‘తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి మార్గదర్శకం. తెలంగాణ తలెత్తుకునేలా సచివాలయ నిర్మాణం. సచివాలయం నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. అంబేడ్కర్, గాంధీ (Ambedkar Gandhi) చూపిన మార్గంలోనే తెలంగాణ సాధించాం. తెలంగాణ పునర్నిర్మాణ కాంక్షను అర్థం చేసుకోలేక.. కొందరు పిచ్చి కూతలు కూశారు. మరుగుజ్జుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరవు పాలమూరులో వలసలు లేకుండా చేశాం. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించాం. మరుగుజ్జుల్లారా ఇప్పటికైనా మీ కుళ్లును మానుకోండి. సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలు వెలుగుతున్నాయి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ (Hyderabad) దూసుకుపోతోంది. కలియుగ వైకుంఠంగా యాదాద్రి నిలుస్తోంది. శోభాయమానంగా, శిఖరాయమానంగా సచివాలయంసెక్రటేరియట్ నిలుస్తోంది’’ అని కేసీఆర్ ప్రకటించారు.

ANN TOP 10