AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొత్త సచివాలయంలో కొలువుదీరిన మంత్రులు..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులయ్యారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు.

అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్‌.. పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయగా మంత్రి హరీశ్‌ రావు రెండు దస్త్రాలపై సంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

ANN TOP 10