AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరల్డ్ క్రికెట్ లో భద్రాద్రి బిడ్డ సత్తా

  • వరల్డ్ క్రికెట్ లో భద్రాద్రి బిడ్డ సత్తా
  • ఫైనల్లో దుమ్మురేపిన గొంగడి త్రిష
  • అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రభుత్వ విప్ రేగా
  • సీఎం KCR అభినందనలు

వరల్డ్ క్రికెట్ లో మన్యంబిడ్డ సత్తా చాటింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌లో భారత జట్టు విశ్వవిజేతగా అవతరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష తన అద్భుత ప్రదర్శనతో ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్ తో ఫైనల్ మ్యాచ్ లో త్రిష 24 పరుగులు సాధించింది. తొలి రెండు వికెట్లు వెంటవెంటనే కోల్పోయినప్పటికీ తెలుగమ్మాయి గొంగడి త్రిష, సౌమ్య తివారీ జోడి 46 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో భద్రాద్రి జిల్లా బిడ్డ త్రిష కీ రోల్ పోషించింది. త్రిష సాధించిన ఫీట్ పై భద్రాద్రి జిల్లా నే కాదు భారతదేశమే పులకరించిపోతోంది

 

అద్వితీయ విజయం సాధించిన భారత మహిళా జట్టుకు, తెలంగాణ కు చెందిన గొంగడి త్రిష కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. త్రిష భద్రాద్రి జిల్లా బిడ్డ కావడం అందరికీ గర్వకారణం అని ప్రభుత్వవిప్ రేగా కాంతారావు అన్నారు.
అభినందనలు

ANN TOP 10