వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భాస్కర్ రెడ్డికి ఒక్కసారిగా బీపీ లెవల్స్ 170కి పెరిగాయి. బీపీ పెరగడంతో ఈసీజీ 2D ఎకో పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి లాయర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైద్య పరీక్షలు తర్వాత సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు భాస్కర్ రెడ్డిని హాజరుపరచనున్నారు. భాస్కర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తుంది.
