తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలాకర్‌కు పెను ప్రమాదం తప్పంది. కరీంనగర్ జిల్లా చెర్లబూట్కూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో మంత్రి గంగుల సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగుల కాలుకు స్వల్పగాయమైంది. ఇదే సభలో పాల్గొన్న ఓ జడ్పిటీసీ సభ్యుని కాలు విరగడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
గంగుల కమలాకర్‌ను కూడా ఆసుపత్రికి తరలించగా.. డాకర్లు ఆయన కాలుకు కట్టుకట్టారు. ప్రమాదంపై స్పందించిన మంత్రి.. తనకు చిన్న గాయమే అయిందని చెప్పారు. డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజీ వేశారన్నారు. తనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు చెప్పారు. అయితే పరిమితికి మంచి సభా వేదికపై నేతలు ఎక్కటంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గంగుల స్వల్ప గాయంతో బయటపడటంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.