హైదరాబాద్ లోని ఎంఎన్‌జే హాస్పిటల్ లో కాన్సర్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్‌ఆర్ ద్వారా 80 కోట్ల నిధులతో ఎంఎన్‌జే హాస్పిటల్ లో నిర్మించిన అంకాలజీ బ్లాక్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.చారిత్రాత్మకమైన ఎంఎన్‌జే హాస్పిటల్‌కి అదనంగా 300 పడకల బ్లాక్ నిర్మించి ప్రభుత్వానికి అందించిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిగితా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహాయం అందించాలని కోరారు.కార్పొరేట్ కంపెనీలో ప్రభుత్వ ఆసుపత్రులకు సీఎస్‌ఆర్ నిధులు ఇవ్వడం ద్వారా.. వేల మంది పేదలకు సేవ చేసిన వారవుతారని చెప్పారు.
దేశంలోనే ప్రభుత్వ రంగ ఆసుపత్రులలో ఎంఎన్‌జే హాస్పిటల్ రెండో స్థానంలో నిలిచిందని వెల్లడిరచారు.. ఆస్పత్రిలో 120 బెడ్లు చిన్న పిల్లలకి కేటాయించామని.. ఇక్కడ వైద్యంతో పాటు చిన్న పిల్లలకి విద్య అందించేందుకు టీచర్ ను కూడా నియమించామని చెప్పారు. నిమ్స్, ఎంఎన్‌జే హాస్పిటలల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బోన్ మారో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామన్నారు.జీవిత కాలం పాటు ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా మందులు అందిస్తున్నట్టు వెల్లడిరచారు.అరబిందో 80 కోటత్లో భవనం నిర్మిస్తే..ప్రభుత్వం 60 కోట్లతో పరికరాలు కొనుగోలు చేసిందని చెప్పారు. రాబోయే సంవత్సరం పది వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లు అందుబాటులోకి వస్తాయని.. ఇది ఒక చారిత్రాత్మకమైన అంశంగా అభివర్ణించారు.