హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. విగ్రహం కింద ఏర్పాటు చేసిన మ్యూజియంలో అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫొటోలు, ఆయన రాసిన పుస్తకాలు ఉంచారు. విగ్రహాన్ని పద్మభూషణ్ గ్రహీత రామ్ వాంజీ సుతార్ రూపొందించారు.
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం..
2016లో అంబేద్కర్125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 2016 ఏప్రిల్ 14న ఎన్టీఆర్ పార్క్ పక్కన 11.7 ఎకరాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ చేశారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, దాదాపు ఏడేండ్ల టైమ్పట్టింది. 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్ ఆకృతిలో నిర్మించిన పీఠంపై 125 అడుగుల ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్విగ్రహమని అధికారులు చెబుతున్నారు.
విగ్రహావిష్కరణ
ఎత్తు : 125 అడుగులు, బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు
వాడిన స్టీల్: 360 టన్నులు, కాంస్యం: 114 టన్నులు
ఖర్చు : రూ.146 .50 కోట్లు
విస్తీర్ణం : 1.35 ఎకరాలు