వరుస సినిమాలతో బిజీగా ఉంది యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల. ‘పెళ్లి సందడి’ చిత్రంతో పరిచయమైన ఈ భామ…ఇటీవల ‘ధమాకా’ సూపర్‌హిట్‌తో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పటికే మహేష్ బాబు 28, ఎన్‌బీకే 108 చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల…తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీమ్‌లో చేరింది. హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది. ఈ సెట్‌లో అడుగుపెట్టింది శ్రీలీల. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెను ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపింది.
