AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యుదాఘాతంతో ముగ్గురు అన్నదమ్ములు మృతి

బంజారాహిల్స్‌లో విషాదం..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ (Banjarahills) పారామౌంట్‌ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంట్లోని నీటి సంపును కడుగుతుండగా విద్యుదాఘాతంతో (Short circuit) ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు. రాజాక్‌ (18) అనే యువకుడు తమ ఇంట్లో ఉన్న నీటి సంపును (water sump) శుభ్రం చేసేందుకు అందులోకి దిగాడు.

అయితే అతనికి కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో రాజాక్‌ను కాపాడటానికి అతని సోదరులు అన్నస్‌ (19), రిజ్వాన్‌ (16) సంపులోకి దిగారు. దీంతో వారికి కూడా షాక్‌ తగలడంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమితం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10