ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోర ప్రమాదంపై.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కూడా ఫోన్ చేసి, ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మంత్రి కేటీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
