దేశానికి దశదిశ చూపిన మహనీయుడు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ అని,అన్నివర్గాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిలో నిలిచిపోతారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కంది శ్రీనివాస రెడ్డిని మర్యాదపూరక్వంగా కలిశారు.అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు శ్రీనివాస రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ,జయంతి వేడుకలకు సంబంధించినవాల్ పోస్టర్లను కంది శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
