AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుఖేశ్ చంద్ర వాట్సాప్ చాటింగ్ పై ఈడీకి ఫిర్యాదు

లిక్కర్ స్కాంలో సంచలనంగా మారిన సుఖేశ్ చంద్రశేఖర్ వాట్సాప్ చాటింగ్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సుఖేశ్ చంద్ర చేసిన వాట్సాప్ చాట్ పై ఈడీ అధికారులను కలిశారు.పెద్ద నోట్ల తర్వాత రెండు లక్షలకు మించి ట్రాన్సక్షన్ జరిగితే.. విచారణ చేయాలని రఘునందన్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పార్క్ చేసి ఉన్న 6060 నంబర్ రేంజ్ రోవర్ కార్ లో డబ్బులు పెట్టానని సుఖేష్ తన లేఖలో చెప్పాడని, ఆ కారు ఎవరిదో అధికారులు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లోకి ఆ కారు ఎన్నిసార్లు వచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు ఆ కారు వివరాలు బయట పెట్టాలన్నారు.తెలంగాణ భవన్ కు వచ్చిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను విడుదల చేయాలన్నారు.

ఐదు దఫాలుగా సుఖేష్ తెలంగాణ భవన్ కి వచ్చి 15 కోట్లు ఇచ్చానని చెప్పాడని, ఒక పార్టీ కార్యాలయానికి నేరారోపణ కలిగిన వ్యక్తి ఎందుకు వచ్చాడని నిలదీశారు. దీనిపై ఖచ్చితంగా విచారణ జరగాలన్నారు. లిక్కర్ స్కాం అబద్ధం అయితే.. బయటికి వచ్చిన వాట్సాప్ చాటింగ్ నిజం కాదని ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. మనీలాండరింగ్ కింద దీన్ని విచారణ చేయాలన్నారు.సుఖేష్ చంద్ర, కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ప్రింట్లు ఈడీ అధికారులకు ఇచ్చామని, దీనిపై లోతుగా విచారణ చేస్తామని అధికారులు చెప్పారని వెల్లడించారు.

ANN TOP 10