AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాచారంలో భారీ అగ్నిప్రమాదం

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలోని జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో.. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భారీగా మంటలు,దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ANN TOP 10