AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎక్సైజ్ శాఖ మంత్రి కనుసన్నల్లోనే కల్తీ కల్లు దందా:డీకే అరుణ

మహబూబ్ నగర్ లో కల్తీ కల్లు మరణాలపై బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సొంతజిల్లాలో కల్తీ కల్లు దందా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వైద్యమందిస్తున్న ఆస్పత్రిలోకి మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. కల్తీ కల్లు కాదు.. వడ దెబ్బ వల్ల అస్వస్థకు గురయ్యారని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కల్తీ వ్యాపారాలు, భూవ్యాపారాలు చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కల్తీకల్లు విషయంలో విచారణ జరిపించి… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కసన్నుల్లోనే కల్తీ కల్లు దందా సాగుతోందని, సామాన్యులు కల్తీ కల్లు తాగి చనిపోవడంపై బాధ్యత వహించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఖమ్మం చీమలపాడు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యానికి పేదలు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండుటెండలో బాణాసంచా కాల్చి భయానక వాతావరణం సృష్టించారని ఫైర్ అయ్యారు.
చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10