తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్లు అక్కడ ఓటు రద్దు చేసుకుని.. తెలంగాణలో నమోదు చేసుకోవాలన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. ఏపీలో ఏం అభివృద్ధి జరుగుతుందో.. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందంటూ కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణలో ఏం డెవలప్ మెంట్ ఉందని విమర్శించారు. వారి కామెంట్లను సీరియస్ గా తీసుకున్న హరీష్ రావు.. ఏ మాత్రం తగ్గకుండా రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి.. ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందని.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉందని.. కేసీఆర్ కిట్ ఉందన్నారు. కళ్యాణ లక్ష్మీ ఉంది.ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉన్నాయి..అని తెలిపారు.
అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఎగబెట్టిన ప్రశ్నించే ధైర్యం లేదని విమర్శించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. విశాఖ ఉక్కు ను తుక్కు కింద పెట్టినా .. పశ్నించే వారే లేరని మండిపడ్డారు. అధికార పార్టీ అడగదు.. ప్రతి పక్షం ప్రశ్నించదని విమర్శలు చేశారు. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనవసరంగా మా జోలికి రావద్దని, మా గురించి ఎక్కువ మాట్లావద్దని. అది మీకే మంచిదని సూచించారు.