ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని ప్రమాదం.. తీవ్ర విషాదాన్ని నింపింది. ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.నిప్పురవ్వలు ఓ గుడిసె పై పైడి నిప్పు అంటుకుంది.గుడిసెలో ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అయ్యి పెను ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలుడు ధాటికి ఒకరు మృతిచెందగా..పదిమందికి గాయాలయ్యాయి.గాయపడిన వారిలో పోలీసులు,జర్నలిస్టులు ఉన్నారు.పేలుడు దాటికి పలువురికి కాళ్లు,చేతులు తెగిపడ్డాయి.ఆత్మీయ సమ్మేళనం మొత్తం రక్తసిక్తంగా మారింది.
