AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి జానారెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఛాతీ నొప్పితో యశోద హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఎంజియోగ్రామ్ టెస్ట్ చేసిన డాక్టర్లు.. స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

ANN TOP 10