రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ కంటైనర్ బోల్తాపడింది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా.. హిమాయత్ సాగర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
