AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడు ప్రధాన పార్టీలకు ఈసీ ఝళక్

మూడు ప్రధాన పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ పార్టీలు జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు ప్రకటించింది. ఈ మూడు పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీ హోదాను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 2019 జూలైలో ఈ పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో తమ పనితీరు తర్వాత ఆయా పార్టీల జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ కోరింది. తాజాగా ఆ మూడు పార్టీల జాతీయ హోదా రద్దు చేసింది. అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించింది.మరోవైపు జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తున్న బీఆర్ఎస్ కు షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్కు రాష్ట్ర పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.బీఆర్ఎస్ తెలంగాణలో రాష్ట్ర పార్టీగానే కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది.

ANN TOP 10