AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి వికర్ష్‌ టెన్షన్‌.. కోవర్టుల ఏరివేతపై అధిష్టానం నజర్‌!

తెలంగాణ బీజేపీలో ఇవిగో చేరికలు.. అవిగో చేరికలు అన్నారు. కానీ చివరికి ఉన్న వారు కూడా జంపయ్యే పరిస్థితి కనిపించడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బండి సంజయ్‌ ఎవరూ వెళ్లవద్దని .. వెళ్లిపోయిన వాళ్లు రావాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత కలహాలను ఇప్పుడు కాంగ్రెస్‌ నేత రేవంత్‌ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బీజేపీలో టెన్షన్‌ మొదలైంది. బీజేపీలో అసంతృప్త, వలస నేతల్ని రేవంత్‌ ఆహ్వానిస్తున్నారు. ఈటల రాజేందర్‌ లక్ష్యం నెరవేరాలంటే కాంగ్రెస్‌ పార్టీ సరైనదని సందేశం పంపుతున్నారు. ఆయనను మాత్రమే కాదు మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌తోపాటు విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా టార్గెట్‌ చేశారు. వీరి లక్ష్యం బీజేపీలో ఉంటే నెరవేరదని.. రేవంత్‌ అంటున్నారు. వలస నేతలకు గాలం? నిజానికి వీరంతా బీజేపీలోకి వలస వచ్చినవారే. ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యం లేకుండా గడిపేస్తున్నారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా రేవంత్‌ కూడా సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. అందుకే రేవంత్‌ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారని.. బీజేపీపీలో చేరిన వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌కు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అసలే బీజేపీలో చేరికలు అంతంత మాత్రంగా ఉన్నాయి. చాలా పెద్ద మిషన్‌ పెట్టుకుని పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు.

ఈ లోపు రేవంత్‌రెడ్డి ఉన్న నేతల్ని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూండటంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అప్రమత్తమయ్యారు. తిరిగి రావాలని పిలుపు.. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీని వీడిన వారు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. కొత్త వారు కూడా రావాలని ఆయన కోరుతున్నారు. నిజానికి బండి సంజయ్‌ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక.. తనకు ప్రాధాన్యత లేదని విజయశాంతి ఫీలవుతున్నారు. ఈ భావన తొలగించడానికి ఆయన విజయశాంతి కార్యక్రమాన్ని హాజరయ్యారు. బీజేపీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇక చేరడమే తరువాయి అనుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. రివర్స్‌లో కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటే బీజేపీ ఇప్పటి వరకూ తెచ్చుకున్న హైప్‌ పూర్తిగా కోల్పోతుంది. రేసులో లేకుండా పోతుంది. కోవర్టులపై హైకమాండ్‌ నజర్‌..

ANN TOP 10