బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ బలగం సినిమా చూశారు. బండి సంజయ్ తో పాటు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు బలగం సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కూడా బలగం సినిమా చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ కు మానవ సంబంధాలకంటే… మనీ సంబధాలే ఎక్కువయ్యాయన్నారు. కుమార్తె పెళ్లి రోజు రేవంత్ ను అరెస్ట్ చేశారని, అత్తగారి దినకర్మ రోజు తనను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఇక పేపర్ లీక్ కేసులో ఎమ్మెల్యే ఈటలకు ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. తమపై అక్రమ కేసులు నమోదు చేశారని… వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రకస్తే లేదని చెప్పారు.
