కర్నాటకలో కాంగ్రెస్ అస్థిరపరిచేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ దేశానికే ప్రమాదమన్నారు. గాంధీభవన్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అక్రమసంపాదనలతో దేశాన్ని శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని… కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి వేల కోట్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు.
