AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకే అక్రమ కేసులు: ఈటల

పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోలీసులు విచారించారు. వరంగల్ డీసీపీ కార్యాలయంలో ఈటల స్టేట్ మెంట్ ఇచ్చారు. తన ఫోన్ ను పోలీసులకి ఇచ్చి.. వారికి కావాల్సిన సమాచారం ఇచ్చారు. పోలీసులు నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుండి ఎలాంటి వాట్సాప్ మెసేజ్ రాలేదని… వేరే నంబర్ నుండి వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదని వివరణ ఇచ్చారు ఈటల.పరీక్షల సమయంలో నేరుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి… ధైర్యం చెప్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని… అలాంటి పార్టీలో ఉన్న నేను పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే కోరుకుంటానన్నారు. తొమ్మిదిన్నరకు పరీక్ష ప్రారంభమైతే.. 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని తమను ఇబ్బంది పెట్టడానికి పన్నాగాలు వేస్తున్నారని మండిపడ్డారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ను డైవర్ట్ చేయడానికే.. మాపై కేసులు పెట్టారన్నారు. లిక్కర్ స్కాంలో సుఖేష్ చంద్రశేఖర్ కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి రేంజ్ రోవర్ కారులో ఇచ్చానని చెప్తుంటే.. దానిపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించాలని చూస్తున్నారన్నారు తెలంగాణలో డైట్ ఛార్జీలు ఇవ్వరు.. పెన్షన్ సకాలంలో ఇవ్వరు.. కాంట్రాక్టర్లకు డబ్బులు రావు కానీ, దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు భరిస్తామంటున్నారని విమర్శించారు.

ANN TOP 10