AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ముందా: మహేష్ గౌడ్

ఈ నెల 14 న మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.దేశసంపదను అదానీ,అంబానీలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీపట్ల కేంద్రంలోని బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. మతంపేరుతో బీజేపీ లూటీ చేస్తోందని,దీన్ని ప్రశ్నించడమే సభ ఉద్దేశ్యమని చెప్పారు.బీజేపీ,బీఆర్ఎస్ లు కలిసి డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు.సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.విభజన చట్టంలో పొందుపర్చిన హామీలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారుకాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్నారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ములేని మీరు..విశాఖ స్టీల్ కు టెండర్లు వేస్తారా?.. ఎవర్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.లిక్కర్ కేసులో కవిత తర్వాత నోటీసులు తీసుకున్న వారు అరెస్ట్ అవుతారని .. కానీ కవితను మాత్రం అరెస్ట్ చేయరని అన్నారు.బీజేపీ,బీఆర్ఎస్ లు ఒకటేనని ఆరోపించారు.

 

ANN TOP 10