AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రి ఆలయంపై మరోసారి డ్రోన్‌ కలకలం..

యాదాద్రి ఆలయంపైన మరొసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఆలయంపై డ్రోన్ ఎగరవేసిన ఇద్దరు యువకులను ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులుగా గుర్తించారు.

ప్రస్తుతం ఎస్పీఎఫ్ సిబ్బంది యువకుల నుంచి డ్రోన్ కెమెరా, ఒక్క కార్, రెండు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. యాదాద్రి ఆలయంలో మూడవసారి డ్రోన్‌ల ప్రదర్శనలు జరగడంతో భద్రత విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువకులను విచారిస్తున్నారు.

ANN TOP 10