AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కామెరాన్ గ్రీన్: కేకేఆర్‌లో చేరడంపై సంతోషం

ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌కు రికార్డు ధర లభించింది. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఏకంగా రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు, కేకేఆర్ జట్టు రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన తన సహచర ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డును అధిగమించాడు.

కేకేఆర్ జట్టులోకి రావడంపై కామెరాన్ గ్రీన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కోల్‌కతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన స్పందిస్తూ, “ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టులో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆడేందుకు, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది మాకు గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నాను. త్వరలో కలుద్దాం” అని వ్యాఖ్యానించాడు.

రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గ్రీన్ కోసం మొదట కోల్‌కతా, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. అత్యధికంగా రూ. 64.30 కోట్ల పర్సుతో వేలంలోకి వచ్చిన కేకేఆర్, చివరి వరకు పోటీపడి గ్రీన్‌ను సొంతం చేసుకుంది. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన గ్రీన్‌ను అప్పట్లో రూ. 17.5 కోట్లకు కొనుగోలు చేశారు.

ANN TOP 10