AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దటీజ్ పవన్ కళ్యాణ్….

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన సమస్యల పరిష్కారం పట్ల వేగంగా స్పందించి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయనను కలిసిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు, ఇటీవల ప్రపంచకప్ గెలిచినందుకు ఆయన నుంచి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సంపాదన నుంచి రూ. 84 లక్షల ప్రోత్సాహకాన్ని ఆటగాళ్లకు అందించారు.

అభినందనల తర్వాత, భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ సొంత గ్రామానికి (సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం, హేమవతి పంచాయతీలోని తంబలహెట్టి) సరైన రోడ్డు సౌకర్యం లేక తాము పడుతున్న ఇబ్బందులను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీపిక విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ అత్యంత వేగంగా స్పందించారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రం అయ్యేసరికి అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సత్యసాయి జిల్లా అధికారులు వెంటనే తంబలహెట్టి రోడ్లను పరిశీలించి అంచనా రూపొందించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ రూ.3 కోట్లు అవసరమని తేల్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ వెంటనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించడంతో, సత్యసాయి జిల్లా కలెక్టర్ సాయంత్రానికే పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. దీంతో ఉదయమే ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్నారు.

ANN TOP 10