AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు: “నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్”

తెలంగాణ బీజేపీలో మరోసారి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గపోరాటం తెరపైకి వచ్చింది. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈ వివాదం ప్రారంభమైంది. బండి సంజయ్ వర్గీయులు ఎక్కువగా బీజేపీ మద్దతుదారులుగా పోటీ చేయగా, ఈటల రాజేందర్ తన అనుచరులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు వారిని కూడా బరిలోకి దించారు.

ఈ ఎన్నికల నేపథ్యంలో, బండి సంజయ్ పీఆర్వోగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈటల రాజేందర్‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టాడనే ప్రచారం జరిగింది. దీనిపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఆయన స్పందిస్తూ, తాను బీజేపీ ఎంపీనని స్పష్టం చేస్తూనే, ఆ పోస్టులు పెట్టిన వారిని ‘అవగాహన లేని పిచ్చోళ్ళు’ అని మండిపడ్డారు.

సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారని” పేర్కొన్నారు. “టైమ్ విల్ డిసైడ్” అని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల రెండో, మూడో విడత పూర్తయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ చెప్తానంటూ, ఈటల రాజేందర్ బహిరంగంగానే హెచ్చరించారు. హుజూరాబాద్‌లో తన క్యాడర్‌కు అన్యాయం జరిగితే తాను ఊరుకునేది లేదన్న భావనలో ఆయన ఉన్నారు.

ANN TOP 10