AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చోర్ రేవంత్ రెడ్డి’: గ్లోబల్ సమ్మిట్‌పై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఫ్లాప్ అయ్యిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టినా, ఈ సమ్మిట్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టమైన దిశా నిర్దేశం, లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక లేదని, దానిని ‘విజన్‌లేని డాక్యుమెంట్’గా ఆయన అభివర్ణించారు.

హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, “క్యూర్, ప్యూర్, రేర్ అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి… అసలు తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ లా మారిపోయాడు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో జరిగిన ఒప్పందాల వెనుక చీకటి లావాదేవీలు ఉన్నాయని, అవి కేవలం అంకెల గారడీ తప్ప వాస్తవ ప్రయోజనం లేదని ఆయన ఆరోపించారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు, సమ్మిట్‌లు నిర్వహిస్తూనే ఉన్నారని, ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన అసలు పెట్టుబడులు, గ్రౌండ్ అయిన కంపెనీలు, యువతకు లభించిన ఉద్యోగాల వివరాలను శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదే గ్లోబల్ సమ్మిట్ వేదికగా బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ మరియు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రశంసించారని హరీశ్ రావు గుర్తు చేశారు. విదేశీ ప్రముఖులు కూడా కేసీఆర్ పాలనను కొనియాడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం తన చిల్లర చేష్టలతో అభివృద్ధిని నాశనం చేయొద్దని హరీశ్ రావు హితవు పలికారు.

ANN TOP 10