మలయాళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు (Dileep) కేరళ కోర్టులో ఊరట లభించింది. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో ఎర్నాకుళం కోర్టు ఈ రోజు తీర్పును వెలువరిస్తూ, నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2017లో ఒక ప్రముఖ నటి కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడం అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేసింది.
ఈ కేసుకు సంబంధించి 2017లో నటుడు దిలీప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దిలీప్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఏంటంటే, 2017లో మలయాళ నటి కిడ్నాప్‌నకు గురైనప్పుడు, కారులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా తీర్పుతో గతంలో బెయిల్‌పై బయట ఉన్న దిలీప్‌కు ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించినట్లైంది. ఎనిమిదేళ్లుగా నడుస్తున్న ఈ కేసు మలయాళ చిత్ర పరిశ్రమపై మరియు దేశవ్యాప్తంగా సినీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇటువంటి సున్నితమైన కేసులో కోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించడంతో ఈ వార్తపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.









