AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై స్పందించిన బీజేపీ..!

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. జీహెచ్ఎంసీని విస్తరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.

 

ఈ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ విలీనం అశాస్త్రీయంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు మున్సిపాలిటీలను విలీనం చేస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.

ANN TOP 10