భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పైలెట్ రూపంలో కనిపించారు. రాష్ట్రపతి ముర్ము(President Murmu) సంప్రదాయ చీరకు బదులుగా ఎయిర్‌ఫోర్స్ పైలట్ దుస్తులను ధరించి కనిపించారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం(Sukhoi fighter jet)లో రాష్ట్రపతి ప్రయాణించారు. అస్సాంలోని తేజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(Tej Air Force Station)లో ఈ దృశ్యం కనిపించింది.
నిజానికి రాష్ట్రపతి త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాష్ట్రపతి ముర్ము ప్రయాణించిన సుఖోయ్ విమానం తేజ్‌పూర్ స్టేషన్‌లో సురక్షితంగా ల్యాండ్(Land) అయింది. ఈ చొరవతో ద్రౌపది ముర్ము.. సుఖోయ్ విమానంలో ప్రయాణించిన భారత రెండవ మహిళా రాష్ట్రపతిగా నిలిచారు. అంతకు ముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోయ్‌లో ప్రయాణించారు.
ఆమె 2009లో పూణే ఎయిర్‌ఫోర్స్ బేస్(Pune Airforce Base) నుంచి సుఖోయ్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. కాగా రాష్ట్రపతి ముర్ము సుఖోయ్ MK-30Iలో ప్రయాణించారు. ఇది రష్యా అభివృద్ధి చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా(Hindustan Aeronautics Limited of India) లైసెన్స్‌తో నిర్మితమయ్యింది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల అస్సాం పర్యటనలో ఉన్నారు. ఏప్రిల్ 6న కజిరంగా జాతీయ పార్కు(Kaziranga National Park)ను ప్రారంభించారు.
7న మౌంట్ కాంచన్‌జంగా ఎక్స్‌పెడిషన్-2023ని ప్రారంభించారు. శుక్రవారం గౌహతి హైకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. శనివారం గౌహతి(Guwahati) నుంచి తేజ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు. ఇక్కడ ఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్ సుప్రీం కమాండర్‌కు స్వాగతం పలికారు. దేశ రాష్ట్రపతి అయిన తర్వాత ద్రౌపది ముర్ము అస్సాం(Assam)లో పర్యటించడం ఇది రెండోసారి. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ ద్వారా స్వాగతం పలికారు.