తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రజాపాలన వారోత్సవాలు, సౌదీ అరేబియా ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో, డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.








