సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. సీనియర్ నటీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్(Pavitra lokesh) కలిసి నటిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ లైన్ తో రానుంది. ‘ఏడు అడుగులు, రెండు మనసులు, ఒకటే ప్రాణం’ అంటూ దర్శకుడు సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఏప్రిల్ 13న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నరేశ్(Naresh), పవిత్రల లిప్ లాక్ వీడియోను చూసి చాలా మంది వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నట్టుగా పొరపడ్డారు.
నరేశ్ వ్యక్తిగత వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రావడంతో సహజంగానే క్యూరియాసిటీని పెంచేసింది. నరేశ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల, జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్ వంటి వారు నటిస్తున్నారు.
పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 13న రిలీజ్ చేయనున్నట్లు నరేష్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా మళ్లీ పెళ్లి అది .. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు.