నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఓ 25 ఏళ్ల యువతి తప్పిపోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ కు చెందిన గాయత్రి ఓ పాఠశాలలో ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తోంది. అయితే ఈ నెల 6న తేదీన నల్లమల అడవిలోని సలేశ్వరం జాతర జరిగింది. అయితే ఈ జాతరలో లింగమయ్య దర్శనం గాయత్రి కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె కనిపించలేదు. గాయత్రి వెనక్కి తిరిగిరాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
వెంటనే గాయత్రి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ కూతురు జాతరకు వెళ్లి తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం గాయత్రిని వేతికేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.