AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టెన్త్‌లో డిబార్‌ అయిన హరీష్‌కు ఊరట..

కీలక నిర్ణయం ప్రకటించిన హైకోర్టు
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరంగల్‌లో హిందీ పేపర్‌ లీకేజ్‌ అయిన వ్యవహారంలో.. హరీష్‌ అనే పదో తరగతి విద్యార్థిపై ఐదేళ్ల డిబార్ విధించారు. అయితే తానేమి తప్పు చేయలేదని ఎవరో వ్యక్తి పరీక్ష హాల్‌ కిటీకి దగ్గరకు వచ్చి తనను క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వమని అడిగాడని, ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతోనే ఇచ్చానని హరీష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. హరీష్‌ తల్లిదండ్రులు కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేయొద్దంటూ డిబార్‌ ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే దీనిపై అధికారుల నుంచి స్పందన రాకవడంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా శనివారం హైకోర్టు ఈ అంశంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. హరీష్‌కు ఊరటినచ్చేలా తీర్పునిచ్చింది. హరీష్‌కు మిగతా పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు తెలిపింది. హరీష్‌ సోమవారం నుంచి పరీక్షలకు హాజరుకావొచ్చని హైకోర్టు తెలిపింది. హరీష్‌కు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు అధికారులకు తెలిపింది. ఐదేళ్లు డిబార్‌ చేయడం వల్ల తన కొడుకి భవిష్యత్తుకు తీరని అన్యాయం జరుగుతుందని హరీష్‌ తండ్రి చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో హరీష్‌ సోమవారం నుంచి పరీక్షలు రాసే అవకాశం లభించనుంది.

ANN TOP 10