AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

 భార్య విడిచి వెళ్లిపోవడానికి ప్రతీకారం: ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి చంపిన ఆటోడ్రైవర్

 తెలంగాణలో ఓ ఆటోడ్రైవర్ కిరాతకానికి పాల్పడి, ఐదేళ్ల బాలుడిని హతమార్చాడు. తన భార్య తనను వదిలి వెళ్లిపోవడానికి మృతుడి తల్లి కారణమని ఆటోడ్రైవర్ భావించడమే ఈ ఘాతుకానికి దారితీసింది. పక్కింటి పుల్లమ్మనో, వెనుకంటి ఎల్లమ్మనో చెబితేనే బంధాలు తెగిపోతాయనే భ్రమలో ఆ కిరాతకుడు ఉండిపోయి, ఏ తప్పూ చేయని ఆ తల్లికి కడుపుకోతను మిగిల్చాడు. తాజా నేర ఘటనలో అనంతపురంలోని అరుణోదయ కాలనీకి చెందిన సుశాంత్ (5) అనే బాలుడు బలయ్యాడు.

ఆటోడ్రైవర్ పెన్నయ్య ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి దూరి, బాలుడు సుశాంత్‌ను సంచిలో పెట్టి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కంపచెట్ల మధ్యలో విసిరేసి, ఏమీ తెలియనట్లుగా ఇంటికి చేరుకున్నాడు. తల్లి నాగవేణి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి సుశాంత్ కనిపించకపోవడంతో, మొదట తల్లిదండ్రులు నాయనమ్మ దగ్గర పడుకున్నాడని భావించారు.

ఉదయం అయినా బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి ఆటోడ్రైవర్ పెన్నయ్యపై అనుమానం ఉందని చెప్పడంతో, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో నిందితుడు పెన్నయ్య తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్య తనను వదిలివెళ్లడానికి సుశాంత్ తల్లి నాగవేణి కారణమని, ప్రతీకారంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10