AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్లుటోనియం డీల్ రద్దు: ట్రంప్‌కు పుతిన్ షాక్; అణు అగ్గి రాజుకున్నట్టు భయం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధాన్ని ఆపివేయాలని ట్రంప్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలకు పుతిన్ అడ్డుకుంటున్నారు. చమురు విషయంలో రష్యాను దెబ్బతీయాలని ట్రంప్ భారత్‌ను రష్యా నుండి చమురు కొనుగోలును తగ్గించాలని ఆదేశించినప్పటికీ, భారత్ దానిని ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో, తాజాగా పుతిన్ ట్రంప్‌కు పెద్ద షాక్ ఇస్తూ, అమెరికాతో ఉన్న **ప్లుటోనియం మేనేజ్‌మెంట్ అండ్ డిస్‌పోజిషన్ అగ్రిమెంట్‌ (Plutonium Management and Disposition Agreement – PMDA)**ను రద్దు చేశారు.

రష్యా దగ్గర అణు సామర్థ్యానికి మరియు అణ్వాయుధాల తయారీకి సంబంధించిన మూల పదార్థం (ప్లుటోనియం) చాలా నిల్వ ఉంది. దానిని అడ్డం పెట్టుకునే రష్యా మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. రష్యా కనుక అణుశక్తిని వాడడం మొదలుపెడితే దానిని ఆపడం ఎవరి తరమూ కాదనే ఉద్దేశంతోనే అమెరికా ముందు జాగ్రత్తగా 2000 సంవత్సరంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా రష్యా తన దగ్గర నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియాన్ని అణ్వాయుధాల తయారీకి కాకుండా కేవలం పౌర అణు విద్యుత్ కోసం మాత్రమే వాడాల్సి ఉంటుంది.

ఈ ఒప్పందాన్ని 2010లో సవరించడం జరిగింది, దీని ద్వారా దాదాపు 17 వేల అణ్వాయుధాల తయారీని అడ్డుకున్నట్లు అవుతుందని అమెరికా అంచనా వేసింది. అయితే, ఈ ఒప్పందానికి 2016లోనే గండిపడింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రష్యాతో సంబంధాలు దెబ్బతినడంతో, పుతిన్ కూడా ఈ ఒప్పందాన్ని నిలిపివేశారు. తాజాగా, ఆయన దానిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు సంతకం చేయడంతో, ఇప్పటివరకు ఆగి ఉన్న అణు అగ్గి రాజుకున్నట్టయింది అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

ANN TOP 10