‘కేజీఎఫ్’ మరియు ‘సలార్’ వంటి డార్క్ థీమ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాల్లోనే కాక వ్యక్తిగతంగా కూడా ఎప్పుడూ నలుపు రంగు దుస్తులకే ప్రాధాన్యతనిస్తారనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఒక వేడుకలో తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ ఆయన అభిమానులను, నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది.
తన భర్త ఎప్పుడూ డార్క్ దుస్తుల్లో కనిపించే వ్యక్తి, తొలిసారిగా తెల్లని దుస్తులు ధరించడాన్ని చూసి ఆనందించిన ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి, ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఫైనల్‌గా నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేశాడు” అంటూ లిఖితా రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రశాంత్ నీల్‌ను ఈ కొత్త లుక్‌లో చూసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ప్రశాంత్ నీల్ సినిమాల్లోని పాత్రలు, లొకేషన్లు కూడా ఎక్కువగా డార్క్ షేడ్స్‌లో ఉండటం ఆయన శైలిగా మారింది. ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) అనే భారీ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.









