AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవితతో తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకున్న జాన్వీ కపూర్: భావోద్వేగంలో నటి

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లిని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నటులు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” అనే టాక్ షోకు హాజరైన జాన్వీ, తన తల్లిపై ప్రేమతో స్వయంగా రాసిన ఒక కవితను చదివి వినిపించారు. ఈ సంఘటన జాన్వీ తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నారో మరోసారి స్పష్టం చేసింది.

జాన్వీ చదివిన కవిత సారాంశం హృదయాన్ని కదిలించేలా ఉంది. “నేనొక చిన్నపిల్లని, కానీ అకస్మాత్తుగా ఆ హక్కును కోల్పోయాను. ఎవరి ప్రేమ కోరుకున్నానో, వారికే దూరమయ్యాను. నా సొంత గొంతును కోల్పోయి, ఇప్పుడు అమ్మ గొంతుతో మాట్లాడుతున్నాను. ఈ రూపంలోనే ఆమెను నా దగ్గర ఉంచుకుంటున్నాను,” అంటూ ఆమె తన తల్లితో ఉన్న అనుబంధాన్ని, ఆమె లేని లోటును వ్యక్తం చేశారు. 2018లో శ్రీదేవి జాన్వీ తొలి చిత్రం ‘ధడక్’ విడుదలకు కొన్ని నెలల ముందే దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే.

శ్రీదేవి మరణానంతరం, జాన్వీకి ఆమె సవతి అన్నదమ్ములైన అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అండగా నిలుస్తున్నారు. జాన్వీ ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా’, ‘మిలీ’, ‘బవాల్’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా లభించాయి.

ANN TOP 10